Nit Andhraలో ఎఫ్‌డీపీ

ABN , First Publish Date - 2022-10-04T23:55:23+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) - ‘ఇన్‌సైట్స్‌ ఆన్‌ ఎమర్జింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌ కెమికల్‌ సైన్స్‌’ అంశంపై ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌(ఎఫ్‌డీపీ)ను నిర్వహిస్తోంది

Nit Andhraలో ఎఫ్‌డీపీ

ఆంధ్రప్రదేశ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) - ‘ఇన్‌సైట్స్‌ ఆన్‌ ఎమర్జింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌ కెమికల్‌ సైన్స్‌’ అంశంపై ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌(ఎఫ్‌డీపీ)ను నిర్వహిస్తోంది. ఇది అయిదు రోజుల ప్రోగ్రామ్‌. అక్టోబరు 10 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌ సెషన్స్‌ ఉంటాయి. ఇందులో మెటల్‌ ఆర్గానిక్‌ ఫ్రేం వర్క్స్‌, మాలిక్యులర్‌ కెమిస్ట్రీ, పాలిమర్‌ కెమిస్ట్రీ, కెటాలిసిస్‌, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ సింథసిస్‌, మెడిసినల్‌ కెమిస్ట్రీ అంశాలు వివరిస్తారు. ఫ్యాకల్టీ మెంబర్లు, సైంటిస్ట్‌లు, రిసెర్చ్‌ స్కాలర్లు, డిగ్రీ/ పీజీ స్టూడెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. సెషన్స్‌లో పాల్గొన్నవారికి ఈ - సర్టిఫికెట్‌లు ఇస్తారు. 


ముఖ్య సమాచారం

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.300

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబరు 7

వెబ్‌సైట్‌: nitandhra.ac.in

Updated Date - 2022-10-04T23:55:23+05:30 IST