NIT కురుక్షేత్రలో PHD

ABN , First Publish Date - 2022-08-12T20:22:56+05:30 IST

కురుక్షేత్ర(Kurukshetra)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(National Institute of Technology)(నిట్‌) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

NIT కురుక్షేత్రలో PHD

కురుక్షేత్ర(Kurukshetra)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(National Institute of Technology)(నిట్‌) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజనీరింగ్‌, సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. మొత్తం 80 సీట్లు ఉన్నాయి. పార్ట్‌ టైం, ఫుల్‌ టైం విధానాలు ఎంచుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.


స్పెషలైజేషన్‌ల వారీ సీట్లు: సివిల్‌ ఇంజనీరింగ్‌ 11, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ 8, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 4, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ 12, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 11, మెకానికల్‌ 11, ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ 4, ఫిజిక్స్‌ 3, కెమిస్ట్రీ 3, మేథమెటిక్స్‌ 3, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ 2, వీఎల్‌ఎ్‌సఐ 2, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ 3, మేనేజ్‌మెంట్‌ 3 సీట్లు ఉన్నాయి.  

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ (ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ/సైన్సెస్‌/ హ్యుమానిటీస్‌/ సోషల్‌ సైన్సెస్‌/ మేనేజ్‌మెంట్‌) పూర్తిచేసి ఉండాలి. కనీసం 80 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ క్లాస్‌ 1 ఆఫీసర్‌గా అయిదేళ్ల ప్రొఫెషనల్‌ అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. దూరవిద్య విధానంలో డిగ్రీ/ పీజీ పూర్తిచేసినవారు దరఖాస్తుకు అనర్హులు. పార్ట్‌ టైం ప్రోగ్రామ్‌లో చేరాలంటే  ఆర్‌ అండ్‌ డీ ఆర్గనైజేషన్‌లు/నేషనల్‌ ల్యాబరేటరీస్‌/ పీఎస్ యూలు/ అకడమిక్‌ విద్యాసంస్థల్లో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. అదే అయిదేళ్ల అనుభవం ఉంటే రాత పరీక్ష రాయనవసరం లేదు. వీరితోపాటు యూజీసీ/ సీఎస్ఐఆర్‌ నెట్‌ జేఆర్‌ఎఫ్‌ అర్హత ఉన్నవారికి నేరుగా అడ్మిషన్స్‌ ఇస్తారు. గేట్‌/ యూజీసీ నెట్‌ అర్హత ఉన్నవారికి ఇన్‌స్టిట్యూట్‌ స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.  

రాత పరీక్ష: పరీక్ష పీజీ స్థాయిలో ఉంటుంది. అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే అడుగుతారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌ అన్ని విభాగాలవారికి కామన్‌గా ఉంటుంది. రెండో పేపర్‌ స్పెషలైజేషన్‌కు సంబంధించి ఉంటుంది. మొదటి పేపర్‌లో అనలిటికల్‌ స్కిల్స్‌, రీజనింగ్‌, ఆప్టిట్యూడ్‌ అంశాల నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. దీనికి పరీక్ష సమయం అర్థగంట. రెండో పేపర్లో రిసెర్చ్‌/ స్పెషలైజేషన్‌ అంశాల నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 40 నిమిషాలు. మొత్తం మార్కులు 70. ఈ పరీక్షలో అర్హత పొందాలంటే కనీసం 35 మార్కులు తెచ్చుకోవాలి. 


దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 16

రాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఆగస్టు 18న

రాత పరీక్ష తేదీ: ఆగస్టు 22

ఇంటర్వ్యూలు: ఆగస్టు 23, 24

అడ్మిషన్‌ లెటర్స్‌ ఇచ్చే తేదీ: ఆగస్టు 25

ప్రోగ్రామ్‌లో జాయినింగ్‌ తేదీలు: ఆగస్టు 25 నుంచి 29 వరకు

ప్రోగ్రామ్‌ ప్రారంభం: ఆగస్టు 25 నుంచి

వెబ్‌సైట్‌: nitkkr.ac.in

Updated Date - 2022-08-12T20:22:56+05:30 IST