NIELITలో ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌లు

ABN , First Publish Date - 2022-05-17T20:26:04+05:30 IST

హరిద్వార్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(National Institute of Electronics and Information Technology)(నీలిట్‌) - అడ్వాన్స్‌డ్‌ ట్రెయినింగ్‌, షార్ట్‌ టర్మ్‌ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగలవారు నీలిట్‌ స్టూడెంట్‌ పోర్టల్‌లో అప్లయ్‌..

NIELITలో ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌లు

హరిద్వార్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(National Institute of Electronics and Information Technology)(నీలిట్‌) - అడ్వాన్స్‌డ్‌ ట్రెయినింగ్‌, షార్ట్‌ టర్మ్‌ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగలవారు నీలిట్‌ స్టూడెంట్‌ పోర్టల్‌లో అప్లయ్‌ చేసుకోవాలి. ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ విధానాన్ని అనుసరిస్తారు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా మొదటి 20 మంది అభ్యర్థులకు ట్యూషన్‌ ఫీజు(Tuition‌ Fees)లో 50 శాతం రాయితీ ఇస్తారు. ఈడబ్ల్యూఎస్‌ వర్గానికి చెందిన మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ట్యూషన్‌ ఫీజు ఉండదు. నిబంధనల ప్రకారం ప్రోగ్రామ్‌లు పూర్తిచేసిన వారికి ఈ-సర్టిఫికెట్‌లు ఇస్తారు. ప్రింటెడ్‌ సర్టిఫికెట్‌ కోసం రూ.200లు చెల్లించాల్సి ఉంటుంది. 


ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌లు

అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ అకౌంటింగ్‌ అండ్‌ పబ్లిషింగ్‌ (ఏడీసీఏఏపీ): ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదు నెలలు. ఏదేని గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులు అర్హులు.

సర్టిఫికేషన్‌ కోర్స్‌ ఇన్‌ డేటా ఎంట్రీ అండ్‌ ఆఫీస్‌ ఆటొమేషన్‌ (సీసీడీఈఓఏ): ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు నెలలు. ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి లేదా పదోతరగతి తరవాత ఏడాది వ్యవధి గల ఐటీఐ సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. 

సోలార్‌ లెడ్‌ లైటింగ్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ (ఎస్‌ఎల్‌ఎల్‌పీడీఎం): ప్రోగ్రామ్‌ వ్యవధి తొమ్మిది నెలలు. పదోతరగతి/ ఐటీఐ/ ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సర్టిఫయిడ్‌ ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి ఆర్నెల్లు. (బీఈ/ బీటెక్‌)(ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ బయోమెడికల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

సర్టిఫయిడ్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఇంజనీర్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి ఆర్నెల్లు. బీఈ/ బీటెక్‌/ బీసీఏ/ బీఎస్సీ(ఐటీ/ కంప్యూర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణులు అర్హులు. 

‘ఓ’ లెవెల్‌ కోర్సు: దీని వ్యవధి ఏడాది. పాలిటెక్నిక్‌ డిప్లొమా/ ఇంటర్‌/ పదోతరగతి తరవాత ఏడాది వ్యవధి గల ఐటీఐ కోర్సు చేసినవారు అర్హులు.

కోర్స్‌ ఆన్‌ కంప్యూటర్‌ కాన్సెప్ట్స్‌ (సీసీసీ): ప్రోగ్రామ్‌ వ్యవధి రెండు నెలలు. ఆసక్తిగలవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. 


అడ్వాన్స్‌డ్‌ ట్రెయినింగ్‌/ షార్ట్‌ టర్మ్‌ కోర్సులు

ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు వారాలు. ఒక్కోదానిలో 30 సీట్లు ఉన్నాయి. కోర్సు ఫీజు ప్రోగ్రామ్‌ను అనుసరించి రూ.2400/ రూ.2,000 

కోర్సులు: క్లౌడ్‌ కంప్యూటింగ్‌; వెబ్‌ అప్లికేషన్‌ డెవల్‌పమెంట్‌ - అపాచీ, పీహెచ్‌పీ, ఎంవైఎస్‌క్యూఎల్‌; ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌; ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ డెవల్‌పమెంట్‌; మెషిన్‌ లెర్నింగ్‌ - పైథాన్‌; వెబ్‌ డిజైనింగ్‌; జావా ప్రోగ్రామింగ్‌; ప్రోగ్రామింగ్‌ ఇన్‌ పైథాన్‌; డిజిటల్‌ మార్కెటింగ్‌; ఆటోక్యాడ్‌

అర్హత: కోర్సును అనుసరించి ఇంజనీరింగ్‌ డిప్లొమా/ బీఈ/ బీటెక్‌/ ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు లేదా నీలిట్‌ నుంచి ఓ/ ఏ/ బీ లెవెల్‌ ప్రోగ్రామ్‌లు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్స్‌కు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. 

ఇండస్ట్రియల్‌ ఆటొమేషన్‌- పీఎల్‌సీ/ స్కాడా ప్రోగ్రామ్‌: దీని వ్యవధి ఎనిమిది వారాలు. ఇందులో 30 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌ ఫీజు రూ.4800. డిప్లొమా (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌) / బీఈ/ బీటెక్‌ పూర్తిచేసినవారు/ చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 11 

వెబ్‌సైట్‌: https://nielit.gov.in/haridwar

Updated Date - 2022-05-17T20:26:04+05:30 IST