మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి

ABN , First Publish Date - 2022-08-10T06:18:43+05:30 IST

స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాల కొండ అరుణ అన్నారు.

మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి
జాతీయ జెండాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు

- జడ్పీ చైర్‌పర్సన్‌  అరుణ  


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాల కొండ అరుణ అన్నారు. మంగళవారం కలెక్టరే ట్‌లో ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమాన్ని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం గర్వించేలా వజ్రోత్సవాలను నిర్వహిం చాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ స్వతంత్ర భా రత వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగుర వేయాలన్నారు. ఈ నెల 9 నుంచి 13 వరకు ఇం టింటికీ  జెండాల పంపిణీ జరుగుతుందన్నారు. 13 నుంచి 15 వరకు ప్రతీ ఇంటిపై జెండా రెప రెపలాడాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సి పల్‌ చైర్‌పర్సన్లు జిందం కళాచక్రపాణి, రామ తీర్థపు మాధవి, ఆర్డీవో శ్రీనివాసరావు, చేనేత జౌళి శాఖ ఏడీ సాగర్‌, జడ్పీ సీఈవో గౌతం రెడ్డి, డీఆర్‌డీవో మదన్‌మోహన్‌, డీపీవో రవీం దర్‌, డీపీఆర్వో దశరథం, జిల్లా ఇరిగేషన్‌ అధి కారి అమరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిష నర్లు సమ్మయ్య, శ్యాంసుందర్‌, జడ్పీటీసీ విజయ, కోన రావుపేట ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌  పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-10T06:18:43+05:30 IST