తలకిందులుగా ఎగిరిన జాతీయజెండా

ABN , First Publish Date - 2022-08-16T07:40:57+05:30 IST

మండలంలోని దిలావర్‌పూర్‌ గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.

తలకిందులుగా ఎగిరిన జాతీయజెండా
దిలావర్‌పూర్‌ గ్రామంలో తలకిందులుగా ఎగిరిన జాతీయజెండా

ఖానాపూర్‌ రూరల్‌, ఆగస్టు 15 : మండలంలోని దిలావర్‌పూర్‌ గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచ్‌ హరిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. జెండాను ఎగురవేసిన అనంతరం తలకిందులుగా ఉన్న జెండాను పలువురు గమనించడంతో జెండాను మళ్లీ కిందికి దించి సరిచేసి ఎగురవేశారు. ఈ విషయంపై ఖానాపూర్‌ ఎంపీడీవో వనజను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా తనకు సోషల్‌ మీడియా ద్వారా గ్రామస్తులు ఫోటోలను పంపించారని వాటిని పరిశీలించి జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు తెలియజేసి బాధ్యు లపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2022-08-16T07:40:57+05:30 IST