ఆన్‌లైన్‌లో జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2020-12-05T06:30:02+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), డిసెంబరు 4: ప్రతీ ఏటా నిర్వహించే జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ఈ ఏడాది కొవిడ్‌ నిబంధనలు అనుసరించి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించేందుకు న్యూఢిల్లీలోని శాస్త్ర సాంకేతికవిభాగం తగు చర్యలు చేపట్టిందని జిల్లా విద్యాశాఖాధికారి

ఆన్‌లైన్‌లో జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), డిసెంబరు 4: ప్రతీ ఏటా నిర్వహించే జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ఈ ఏడాది కొవిడ్‌ నిబంధనలు అనుసరించి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించేందుకు న్యూఢిల్లీలోని శాస్త్ర సాంకేతికవిభాగం తగు చర్యలు చేపట్టిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సైన్స్‌ ఉపాధ్యాయులందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకనటలో డీఈ వో మాట్లాడుతూ ప్రధాన అంశంగా సుస్థిరమైన జీవనం కోసం విజ్ఞాన శాస్త్రం ఉప అంశాలు ఇందుకు పర్యావరణ వ్యవస్థ, తగిన సాంకేతికత సామాజిక ఆవిష్కరణ, రూపకల్పనలు, నమూనాలను అభివృద్ధి పరచడం, సంప్రదాయ జ్ఞాన వ్యవస్థ ఉంటాయన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాజెక్టులు ఫీల్డ్‌ ఓరియంటెడ్‌గా కాకుండా రీసెర్చ్‌ ఓరియంటెడ్‌గా ఉండాలని ఆప్‌కాస్ట్‌ మెం బర్‌ కార్యదర్శి డాక్టర్‌ అపర్ణ సూచించారన్నారు. ఒక పాఠశాల నుంచి ఎన్ని ప్రాజెక్టులైనా సమర్పించవచ్చని, పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులెవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. అత్యుత్తమమైన 10 ప్రాజెక్టులను మాత్రమే రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ పద్ధతిలో ఈనెల 20లోగా నిర్వహిస్తామని డీఈవో తెలిపారు. పాల్గొనదలచినవారు గూగుల్‌ లింక్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు అకడమిక్‌ కో ఆర్డినేటర్‌ పీవీ బ్రహ్మానందం ఫోన్‌: 99495 36081, జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు ఫోన్‌: 99127 03697లో సంప్రదించాలని డీఈవో అబ్రహం తెలిపారు. 

Updated Date - 2020-12-05T06:30:02+05:30 IST