‘స్వచ్ఛత’లో జిల్లాకు జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2021-07-25T05:09:36+05:30 IST

స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో జిల్లాలోని ఎంవీజీఆర్‌ కళాశాలకు జాతీయ అవార్డు వరించింది.

‘స్వచ్ఛత’లో జిల్లాకు జాతీయ అవార్డు

కలెక్టరేట్‌, జూలై 24: స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో జిల్లాలోని ఎంవీజీఆర్‌ కళాశాలకు జాతీయ అవార్డు వరించింది.  కేంద్ర ఉన్నత విద్యాశాఖకు చెందిన మహాత్మగాంధీ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ ఈ అవార్డు ప్రకటించింది. జాతీయ స్థాయిలో శనివారం వర్చ్యువల్‌గా జరిగిన సదస్సులో జిల్లా చాంపియన్‌ అవార్డును సంస్థ చైర్మన్‌ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్‌ బహూకరించారు. ఆన్‌లైన్‌ సదస్సులో కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన  కళాశాలకు ప్రతి ష్టాత్మక అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణం పరిరక్షణలో భాగంగా కళాశాల స్వయంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం, వ్యర్థ జలాలను ఇంకుడు గుంతలకు మళ్లించి గార్డెనింగ్‌ కోసం వినియోగించడం, క్యాంటీన్‌లో ఆహార వ్యర్థాలను జీవ ఇంధనం తయారీకి ఉపయోగించడం వంటి చర్యలను కలెక్టర్‌ ప్రశం సించారు. ఆయన వెంట ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు ఉన్నారు. 

 

Updated Date - 2021-07-25T05:09:36+05:30 IST