మారుమోగిన జాతీయ గీతం

ABN , First Publish Date - 2022-08-17T03:55:53+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతాలాపన నిర్వహించారు. అన్ని ముఖ్య కూడళ్ళలో పోలీసులు, విద్యార్థులు, అధికారులు, నాయకులు, ప్రజలు హాజరై జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ జెండాలతో ఊరేగింపు నిర్వహించారు. జాతీయ జెండాలను పట్టుకొని సామూహిక జాతీయ గీతాలపన చేసి దేశభక్తి చాటారు.

మారుమోగిన జాతీయ గీతం
గుడిపేట బెటాలియన్‌లో పాల్గొన్న కమాండెంట్‌ రామకృష్ణ, పోలీసులు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు  16: ప్రజల ఐకమత్యమే జాతికి బలమని  కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. మంగళవారం ఐబీ చౌరస్తాలో 150 ఫీట్ల జెండా వద్ద సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. ఎమ్మెల్యే నడిపె ల్లి దివాకర్‌రావు, డీసీపీ అఖిల్‌ మహజన్‌, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయు లు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ లౌకికత్వానికి ప్రతీక భారతదేశమని, స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే, డీసీపీ మాట్లాడుతూ భారతీ యులంతా సహోదరులని చాటి చెప్పే విధంగా సామూహిక జాతీయ గీతాలా పన చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నా యక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ పల్ల భూమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, ఏసీపీ తిరుపతిరెడ్డి, అధికారులు శేషాద్రి, దు ర్గాప్రసాద్‌, సీఐ నారాయణనాయక్‌, ఎస్సై తహసినోద్దీన్‌, స్నేహ, వెంకన్న, నడి పెల్లి విజిత్‌రావు, ట్రస్మాఅధ్యక్షుడు విష్ణువర్ధన్‌, ప్రవీణ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.  

జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో  జాతీయ గీతాలాపన నిర్వహించారు. డిప్యూటీ సీవో లక్ష్మినారాయణ, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ ప్రకాష్‌, సూపరింటెండెంట్‌ బాలకృష్ణ, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.  

బెల్లంపల్లి: పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ప్రజాప్రతినిధులు, పోలీసు లు, విద్యార్థులు జాతీయ గీతాలాపన చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఏసీపీ ఎడ్ల మహేష్‌లు మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా దేశభక్తిని పెంపొందిం చేందుకు కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రూరల్‌ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగుల బ్యాడ్మింటన్‌ పోటీలను ఎమ్మెల్యే, ఏసీపీలు ప్రారంభించారు. సీఐలు బాబు రావు, ముస్కె రాజు, జగదీష్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కన్నాలలో రైతులు పొలాల్లో జాతీయ గీతాలాపన చేశారు.  

Updated Date - 2022-08-17T03:55:53+05:30 IST