సీఎం నియోజకవర్గంలోని మరో ప్రాంతం పేరు మార్పు?

ABN , First Publish Date - 2022-04-25T19:36:44+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని రెండు ప్రాంతాల పేర్లను ఇటీవల మార్చిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ..

సీఎం నియోజకవర్గంలోని మరో ప్రాంతం పేరు మార్పు?

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రెండు ప్రాంతాల పేర్లను ఇటీవల మార్చిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తాజాగా మరో పట్టణం పేరు మార్చనుంది. సీఎం సొంత నియోజవర్గమైన బుధని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నస్రూల్లా గంజ్ టౌన్ పేరును కొత్తగా మార్చే యోచనలో ఉంది. నస్రూల్లా గంజ్ పేరును భేరుండగా మార్చే ప్రతిపాదనను కేంద్రానికి పంపినట్టు శివరాజ్ సింగ్ ఆదివారంనాడు భోపాల్‌లో జరిగిన ఒక క్రీడాకార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు.


రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల పేర్లను మారుస్తూ ముఖ్యమంత్రి తన కమ్యూనల్ ఎజెండాను ముందుకు తీసుకువెళ్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తుండగా, అభివృద్ధే తమ ఎజెండా అంటూ ఈ ఆరోపణలను బీజేపీ తిప్పికొడుతోంది. నజ్రూల్లాగంజ్ పేరు మార్చాలన్నది స్థానికుల చిరకాల డిమాండ్‌గా బీజేపీ తెలిపింది. కాగా, గత ఫిబ్రవరిలో హోషంగాబాద్ జిల్లా పేరును నర్మదాపురంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మార్పు చేసింది. బబయి టౌన్ పేరును మఖాన్ నగర్‌గా మార్చింది. ప్రముఖ కవి మఖన్‌లాల్ చతుర్వేది జన్మస్థలంగా బబయి టౌన్‌కు పేరుంది. గత ఏడాది నవంబర్‌లో భోపాల్‌లోని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ పేరును గిరిజన రాణి...రాణి కమలాపతి రైల్వేస్టేషన్‌గా మార్చింది.

Updated Date - 2022-04-25T19:36:44+05:30 IST