నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలి

ABN , First Publish Date - 2022-05-24T05:21:57+05:30 IST

మక్తల్‌, నారాయణపేట ప్రాంతాలను సస్యశామలం చేసే 69 జీవోను అమలు చేస్తూ నారాయణపేట కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టాలని జల సాధన సమితి జిల్లా కోకన్వీనర్‌ హెచ్‌. నర్సింహా డిమాండ్‌ చేశారు.

నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలి
నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

 -  జలసాధన సమితి నాయకుల డిమాండ్‌ 

- బిజ్వార్‌లో జీవో కాపీలతో నిరసన 

ఊట్కూర్‌ , మే 23 : మక్తల్‌, నారాయణపేట ప్రాంతాలను సస్యశామలం చేసే 69 జీవోను అమలు చేస్తూ  నారాయణపేట కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టాలని  జల సాధన సమితి జిల్లా కోకన్వీనర్‌ హెచ్‌. నర్సింహా డిమాండ్‌ చేశారు. జీవో జారీ చేసి ఎనిమిదేళ్లు కావడంతో బిజ్వార్‌ గ్రామంలో జలసాధన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రజల చిరకాల కోరికను నెర వేర్చాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చివరిలో ఉన్న ఈ ప్రాంతాన్ని నీరు రావడం సాధ్యం కాదని అన్నారు. ఫలితంగా నారాయణపేట జిల్లా నీరు లేక ఏడారిగా మారుతుందని అన్నారు. 69 జీవో అమలు జరిగితే ఊట్కూర్‌ మండలంలోనే 19625 ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. జీవో అమలు కోసం అందరు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రైతులు కృష్ణయ్య, బాలకిష్టయ్య, అంజనేయులు, విజయ్‌, రామచంద్రయ్య, వడ్డెప్ప, గజలప్ప, నర్సింహులు, బాలనర్సింహులు నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:21:57+05:30 IST