శివారుకు అందని ‘నారాయణపురం’ నీరు

ABN , First Publish Date - 2022-07-31T06:08:56+05:30 IST

జూలై నెల ముగుస్తున్నా ఇప్పటికీ నారాయణపురం కుడికాలువ కింద ఉన్న శివారు ఆయకట్టభూములకు సాగునీరు అందలేదు.

శివారుకు అందని ‘నారాయణపురం’ నీరు
సెగిడిపేట వద్ద కాలువ ద్వారా చుక్క నీరు రాని దుస్థితి


  ఆయకట్టు రైతుల్లో ఆందోళన 

ఎచ్చెర్ల: జూలై నెల ముగుస్తున్నా ఇప్పటికీ నారాయణపురం కుడికాలువ కింద ఉన్న శివారు ఆయకట్టభూములకు సాగునీరు అందలేదు. ఈ నెల 14వ తేదీన సంతకవిటి మండలం రంగరాయ పురం హెడ్‌ వద్ద కాలువను విడిచిపెట్టారు. సాధా రణంగా ప్రతి ఏడాది జూలై రెండో వారంలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి సాగునీరు విడుదల చేస్తా రు. హెడ్‌ వద్ద విడుదల చేసిన వారం రోజుల్లోగా శివారు గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందు తుంది. హెడ్‌ వద్ద నీరు విడిచిపెట్టి రెండు వారా లు పూర్తయినా ఇప్పటికీ నీరు శివారు గ్రామాల ఆయకట్టుకు చేరలేదు. దీంతో అన్నదాతలు ఆందో ళన చెందుతున్నారు. ఎచ్చెర్ల మండలంలో ఇప్పటి వరకు నారాయణపురం కుడి కాలువ కింద తోటపాలెం వరకు సాగునీరు చేరింది. ఇంకా కొత్తపేట, సెగిడిపేట, ముద్దాడ, ఓఏ అగ్రహారం, రామజోగిపేట, ధర్మవరం, కమ్మపేట, పొన్నాడ తదితర ప్రాంతాలకు సాగునీరు చేరలేదు. అలాగే 24/6 సబ్‌ ఛానల్‌ కింద ఉన్న గురువుపేట, ముద్దాడపేట, బింగుపేట, బొంతలకోడూరు తదితర గ్రామాలకు సాగునీరు గత కొన్నేళ్లుగా సాగునీరు సక్రమంగా అందిన పరిస్థితి లేదు. ఈ మండలంలో కాలువ కింద ఉన్న సుమారు 4 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సిఉంది. 


లస్కర్లు లేకుండానే..

కాలువ ద్వారా సాగునీరు సక్రమంగా సరఫరా కు లస్కర్లు ప్రధాన భూమిక వహిస్తారు. అయితే నారాయణపురం కుడి కాలువను లస్కర్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్‌ సీజన్లో తాత్కాలిక పద్ధతిలో లస్కర్లను నియమిసు ్తన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు లస్కర్లను తీసు కోలేదు. గతేడాది పనిచేసిన లస్కర్లకు వేతనాలు కూడా ఇప్పటికీ చెల్లించలేదని తెలుస్తోంది. 


ప్రతి ఏటా  ఇబ్బందే..

ప్రతి ఏటా ఖరీఫ్‌ సీజన్లో సాగు నీటి కోసం ఇబ్బందిపడుతున్నాం. సాగునీరు సకాలంలో అందక వరి ఉబాలు జరగడంలేదు.  పెట్టుబడి కూడా వృథా అవుతోంది. కాలువ కింద భూములు ఉన్నాయే తప్ప, పూర్తిస్థాయిలో పంటలు పండిన దాఖలాలు లేవు.

- పల్లి గణేష్‌, రైతు, రుప్పపేట



Updated Date - 2022-07-31T06:08:56+05:30 IST