కర్నూలు: జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన కర్నూలులో పర్యటించారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీపీ రాజవర్ధన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. రాజవర్ధన్‌రెడ్డి మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మహిళలకు రక్షణ లేదని, 800 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగితే చర్యలు లేవని మండిపడ్డారు. సీఎం జగన్ కనీసం బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. డాక్టర్ సుధాకర్ లాంటి ఘటనలు అనేకం జరిగాయని, వీటికి జగన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారని లోకేష్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి