Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

భావితరాలకు మార్గదర్శి లోకేశ్‌

twitter-iconwatsapp-iconfb-icon
భావితరాలకు మార్గదర్శి లోకేశ్‌ కావలి : జామియా మసీద్‌లో దువా చేస్తున్న టీడీపీ నేతలు

అట్టహాసంగా జన్మదిన వేడుకలు

టీడీపీ నేతల సర్వమత ప్రార్థనలు

కావలి, జనవరి 23: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ భావితరాలకు మార్గదర్శి అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం టీడీపీ నాయకులు ఆలయాలు, చర్చలు, మసీదుల్లో సర్వమత ప్రార్థనలు చేశారు. టీడీపీ కార్యాలయం కట్‌ చేసి అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. లలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకే్‌ష కరోనా నుంచి త్వరగా ,ని కావలి ప్రజలు కరోనా బారిన పడకుండా కాపాడాలని టీడీపీ శ్రేణులు కావలి కలుగోళ్ల శాంభవి అమ్మవారి ఆలయంలో పూజలు, అంబేద్కర్‌ నగర్‌లోని సత్యకృపా ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు, రైల్వే రోడ్డులోని జామియా మసీద్‌లో దువా కార్యక్రమాలు నిర్వహించారు. కలుగోళ్ల శాంభవి ఆలయ ప్రదక్షిణలతో పాటు 101 కొబ్బరి కాయలు కొట్టి కుంకుమ పూజ చేయించారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి సుబ్బారావు, కావలి నియోజకవర్గ త్రిసభ్యకమిటీ సభ్యుడు మాలేపాటి సుబ్బానాయుడు,  టీడీపీ అడ్‌హాక్‌ కమిటీ కన్వీనర్‌ గుత్తికొండ కిషోర్‌బాబు, గ్రంధి యానాదిశెట్టి, మలిశెట్టి వెంకటేశ్వర్లు, మొగిలి కల్లయ్య, బొగ్గవరపు శ్రీనివాసులు, యేగూరి చంద్రశేఖర్‌, కాకి ప్రసాద్‌, జ్యోతి బాబూరావు, కుందుర్తి కిరణ్‌కుమార్‌, మండవ వెంకట్రావు, కోసూరి వెంకటేశ్వర్లు, దావులూరి దేవకుమార్‌, మైనంపాటి జగదీష్‌, గుండ్లపల్లి శివాజీ, షేక్‌ ఖాదర్‌ బాషా, ఉప్పాల వెంకయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఉదయగిరి రూరల్‌ : స్థానిక పంచాయతీ బస్టాండ్‌ సెంటర్‌లో నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు తెలుగు యువత అధ్యక్షుడు సయ్యద్‌ సందానీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ బయ్యన్న, నాయకులు షేక్‌ రియాజ్‌, బొజ్జా నరసింహులు, వెంకటస్వామి, రాజా, ఓబులరెడ్డి, గయాజ్‌, ఎంఏ అలీం, సజిల్‌, ఖాదర్‌బాషా, ఖాన్‌సా, అబీద్‌, మస్తాన్‌, కోళ్ల జానీ తదితరులు పాల్గొన్నారు.  

వరికుంటపాడు : నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను స్ధానిక బస్టాండ్‌ సెంటర్‌లో  మండల తెలుగు యువత అధ్యక్షుడు ముజ్జె లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ చండ్రా మధుసూదనరావు, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ పావులూరి రవీంద్రబాబు, శ్రీకాంత్‌యాదవ్‌, మనోజ్‌కుమార్‌రెడ్డి, యేదుపాటి. రామయ్య, నరసయ్య, మానం కొండలరావు, పోకా మురళి, యేదుపాటి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

కొండాపురం : నారా లోకేష్‌ జన్మదిన  వేడుకలుటీఎన్‌ఎ్‌సఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకూరి నవీన్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తెలుగుయువత, ఐటీడీపీ నాయకులు పలు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి కేకు కట్‌చేసి పంచిపెట్టారు. అనంతరం తూర్పుఎర్రబల్లిలో ఇటీవల అధికారులు తొలగించిన బండారు మాల్యాద్రికి చెందిన ప్రహరీ, రేకులషెడ్డును పరిశీలించారు. ఈకార్యక్రమంలో టీడీపీ కన్వీనర్‌ టీ.లక్ష్మీనారాయణ, యారవ క్రిష్ణయ్య, గంజాం రాఘవేంద్ర, డీ.కృష్ణ, సీహెచ్‌.కృష్ణ, గుడవళ్లూరు సర్పంచు మాచెర్ల,  మణి, చెరుకూరు వెంకటాద్రి, నర్రా చెంచునాయుడు, సీహెచ్‌.బాలకోటేశ్వరరావు, తిమోతి తదితరులు పాల్గొన్నారు.


భావితరాలకు మార్గదర్శి లోకేశ్‌ ఉదయగిరిరూరల్‌ : కేక్‌ కట్‌చేస్తున్న తెలుగు యువత నేత సందానీ


భావితరాలకు మార్గదర్శి లోకేశ్‌ వరికుంటపాడు : కేక్‌ కట్‌ చేస్తున్న మధుసూదనరావు


భావితరాలకు మార్గదర్శి లోకేశ్‌ కొండాపురం : కేకు కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.