Abn logo
Mar 2 2021 @ 23:34PM

నాణ్యత లోపిస్తే చెల్లింపులు కట్‌

మనుబోలు, మార్చి 2: సచివాలయ నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే బిల్లుల చెల్లింపులు ఆగిపోతాయని నాణ్యత నియంత్రణ ఈఈ శివారెడ్డి హెచ్చరించారు. మనుబోలు, పిడూరు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సచివాలయాలను, రైతుభరోసా కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. ఇచ్చిన డిజైన్‌ ప్రకారం నిర్మాణం జరుగుతుందా? కిటికీలు, తలుపులు కొలతల ప్రకారం ఉన్నాయా? గచ్చులో ఎంత సామర్థ్యం ఉందని పరిశీలించి కొలతలు తీసి నమోదు చేశారు. నిర్మాణంలో వాడుతున్న ఇనుప కమ్ములు, సిమెంట్‌, కంకరలో నాణ్యతను పరిశీలించారు. గుత్తేదారులు నాణ్యతకు తిలోదకాలు ఇవ్వకుండా నిర్మాణాలు చేపట్టాలన్నారు.   కార్యక్రమంలో పీఆర్‌డీఈ శ్రీనివాసులు, ఏఈ చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement