ప్రజాస్వామికవాది నంది ఎల్లయ్య కన్నుమూత

ABN , First Publish Date - 2020-08-09T06:30:04+05:30 IST

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, నాగర్‌కర్నూల్‌ మాపీ ఎంపీ నంది ఎల్లయ్య కనుమూశారు. అనారోగ్యంతో ..

ప్రజాస్వామికవాది నంది ఎల్లయ్య కన్నుమూత

  • వార్డు సభ్యుడి నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం
  • ఓటమి ఎరుగని నేతగా రాజకీయ జీవితం
  • పలువురు నేతల సంతాపం


(నాగర్‌కర్నూల్‌-ఆంధ్రజ్యోతి)/మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌), ఆగస్టు 8 : సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, నాగర్‌కర్నూల్‌ మాపీ ఎంపీ నంది ఎల్లయ్య కనుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తుది శ్వాస విడిచారు. వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, నాలుగుసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడుగా పని చేశారు. 2014లో నాగర్‌కర్నూల్‌ ఎస్సీ రిజర్వ్‌డ్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన, రాజకీయంగా ఎన్నడూ ఓటమిని చవిచూడలేదు. నంది ఎల్లయ్య మృతి పట్ల మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లురవి, నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు. 


తెలంగాణలోని నిమ్నవర్గాల ఆత్మబంధువు నంది ఎల్లయ్య మరణం తీరని లోటని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పని చేసిన మహానీయుడు నంది ఎల్లయ్య అని మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత నంది ఎల్లయ్య మరణం కాంగ్రెస్‌కు, వ్యక్తిగతంగా తనకు తీరనిలోటని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. నంది ఎల్లయ్య మృతి చెందటం తనను తీవ్రంగ కలిచి వేసిందని పాలమూరు డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్‌ అన్నారు.

Updated Date - 2020-08-09T06:30:04+05:30 IST