స్వరాజ్య మైదానం పేరు మార్పు

ABN , First Publish Date - 2020-07-09T09:16:19+05:30 IST

నగరంలోని స్వరాజ్య మైదానం పేరు మారింది. ఇక నుంచి దీన్ని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్వరాజ్య మైదాన్‌గా వ్యవహరించనున్నారు.

స్వరాజ్య మైదానం పేరు మార్పు

ఇకపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్వరాజ్య మైదాన్‌

 క్యాంపు కార్యాలయం నుంచి స్మృతి వనానికి సీఎం శంకుస్థాపన 

 త్వరలోనే పనుల ప్రారంభం

 హాజరుకాని ఇన్‌చార్జి మంత్రి


విజయవాడ, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని స్వరాజ్య మైదానం పేరు మారింది. ఇక నుంచి దీన్ని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్వరాజ్య మైదాన్‌గా వ్యవహరించనున్నారు. 125 అడుగలు అంబేడ్కర్‌ కాంశ్య విగ్రహంతోపాటు స్మృతివనం ఏర్పాటుకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి రిమోట్‌ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2022 ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి రోజున దీనిని ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.


ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్‌, హోంమంత్రి మేకతోటి సుచరిత, దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మేకా ప్రతాప్‌, జోగి రమేష్‌, కొలుసు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్‌, కలెక్టర్‌ ఇంతియాజ్‌, జేసీ మాధవీలత, విజయవాడ పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తదితరులు హాజరయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. పలు దళిత సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహుజన కళాకారులు అంబేడ్కర్‌ గీతాలను ఆలపించారు.


దేశం గర్విస్తుంది : నందిగం సురేష్‌

వైఎస్‌ జయంతి రోజున అంబేడ్కర్‌ 125 అడుగుల కాంశ్య విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇది భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయం. విజయవాడ నడిబొడ్డున ఇంత పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడమంటే పెద్ద సాహసమే. ఈ విషయంలో సీఎం జగన్‌కు అంతా రుణపడి ఉంటాం. మాజీ ముఖ్యమంత్రి ఈ విగ్రహాన్ని మారుమూలన పెట్టాలనుకున్నాడు. 

Updated Date - 2020-07-09T09:16:19+05:30 IST