Nallagonda వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

ABN , First Publish Date - 2022-07-08T15:02:27+05:30 IST

ఉమ్మడి నల్గొండ(Nallagonda) జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం (Rain) కురుస్తోంది.

Nallagonda వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

నల్గొండ: ఉమ్మడి నల్గొండ (Nallagonda) జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం (Rain) కురుస్తోంది. నల్గొండలోని పానగల్ బైపాస్ వద్ద భారీగా చేరిన వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పట్టణంలోని పద్మానగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది.  వర్షానికి గోడకూలి తల్లీకూతుళ్ళు నడికుడి లక్ష్మీ (42), కూతురు కళ్యాణి (21) మృతి చెందారు. అటు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) 19.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో  చండూరులో ప్రైవేట్ విద్యా సంస్థలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. 

Updated Date - 2022-07-08T15:02:27+05:30 IST