Abn logo
May 11 2021 @ 07:43AM

నల్లగొండలో తగ్గని కరోనా కేసులు

నల్లగొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనాతో నిన్న ఒక్కరోజే 13 మంది మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా తాజాగా 1,962 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నల్గొండ జిల్లాలో 845, సూర్యాపేట జిల్లాలో 562, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 555 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.