నాగర్‌కోయిల్‌ నుంచి చెన్నైకి రైలు సేవలు

ABN , First Publish Date - 2021-06-04T12:43:08+05:30 IST

దక్షిణ రైల్వే తిరువనంతపురం డివిజన్‌ నుంచి పలు రైలు సేవలను తిరిగి పునరుద్ధరిం చనున్నారు. ఇదే విషయంపై ఈ డివిజన్‌ ప్రధాన కార్యాల యం ఒక ప్రకటన విడుదల చేసిం

నాగర్‌కోయిల్‌ నుంచి చెన్నైకి రైలు సేవలు


అడయార్‌(చెన్నై): దక్షిణ రైల్వే తిరువనంతపురం డివిజన్‌ నుంచి పలు రైలు సేవలను తిరిగి పునరుద్ధరిం చనున్నారు. ఇదే విషయంపై ఈ డివిజన్‌ ప్రధాన కార్యాల యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకారంగా, 06861 అనే నంబరుతో నడిచే పుదుచ్చేరి - కన్నియా కుమారి వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు, 06862 నంబరు కలిగిన కన్నియాకుమారి - పుదుచ్చేరి వారాం తపు ఎక్స్‌ ప్రెస్‌ రైలు సేవలను తిరిగి పునరుద్ధరించారు. అలాగే, 06063 అనే నంబరు కలిగిన చెన్నై ఎగ్మోర్‌ - నాగర్‌కోయి ల్‌ జంక్షన్‌, 06064 నంబరు కలిగిన నాగర్‌కోయిల్‌ - చెన్నై ఎగ్మోర్‌ వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు, 02668 నంబరు కలిగిన కోయంబత్తూరు - నాగర్‌కోయిల్‌ జంక్షన్‌, 02667 నంబరు కలిగిన నాగర్‌కోయిల్‌ జంక్షన్‌ - కోయంబత్తూరు వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు తిరిగి ప్రారంభమైన ట్టు పేర్కొంది. అదేవిధంగా 06127 నంబరు కలిగిన చెన్నై ఎగ్మోర్‌ - గురువాయూర్‌ ప్రత్యేక రైలు, తిరువనంతపురం - చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును జూన్‌ 1వ తేదీ నుంచి 15వ తేదీవరకు రద్దు చేసినట్టు ఆ ప్రకటన పేర్కొంది.


Updated Date - 2021-06-04T12:43:08+05:30 IST