Abn logo
Oct 17 2021 @ 09:58AM

సాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 64,168 క్యూసెక్కులుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు.. కాగా ప్రస్తుతం నీటిమట్టం 589.80 అడుగులుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి నిల్వ  311.1474 టీఎంసీలుంది.