పీలేరు ఇన్‌చార్జి తహసీల్దారుగా నాగప్రసన్నలక్ష్మి

ABN , First Publish Date - 2021-10-28T05:51:14+05:30 IST

పీలేరు తహసీల్దార్‌ రవి కరోనా బారిన పడడంతో రెవెన్యూ సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కేవీపల్లె తహసీల్దార్‌ నాగప్రసన్నలక్ష్మిని ఇన్‌చార్జిగా నియమించారు.

పీలేరు ఇన్‌చార్జి తహసీల్దారుగా నాగప్రసన్నలక్ష్మి
తహసీల్దార్‌ కార్యాలయంలో విధుల్లో ఉన్న సిబ్బంది

పీలేరు, అక్టోబరు 27: పీలేరు తహసీల్దార్‌ రవి కరోనా బారిన పడడంతో రెవెన్యూ సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కేవీపల్లె తహసీల్దార్‌ నాగప్రసన్నలక్ష్మిని ఇన్‌చార్జిగా నియమించారు. ఆమె బుధవారం పీలేరు మండల ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌ తహసీల్దార్‌ రవి కరోనా బారిన పడడంతో రెండు రోజుల పాటు రెవెన్యూ సేవలకు అంతరాయం కలిగింది. బుధవారం మండలంలో రెవెన్యూ సేవలు యథావిధిగా కొనసాగాయి. రెగ్యులర్‌ తహసీల్దార్‌ కోలుకుని విధులకు హాజరయ్యే వరకు ఇన్‌చార్జి తహసీల్దార్‌ అందుబాటులో ఉంటారని, రెవెన్యూ సేవలు ఎప్పటిలాగే యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-28T05:51:14+05:30 IST