Abn logo
Jun 14 2021 @ 23:51PM

20లోగా నాడు-నేడు పనులు పూర్తి చేయాలి

శ్రీకాళహస్తి, జూన్‌ 14: తొలిదశ నాడు-నేడు పనులను ఈనెల 20వతేదీలోగా పూర్తి చేయాలని డీఈవో నరసింహారెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన తొట్టంబేడు ప్రధానోపాధ్యాయులకు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మార్సీలో జరిగిన కార్యక్రమంలో డీఈవో మాట్లాడుతూ... నాడు-నేడు తొలిదశ పనులు ఇప్పటికీ ఎందుకు పూర్తి చేయలేక పోయారని ప్రశ్నించారు. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాళహస్తి మండల విద్యా వనరుల కేంద్రంలో జరిగిన వీడియా కాన్ఫరెన్సుకు ఎంఈవోలు, హెచ్‌ఎంలు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంఈవోలు భారతి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.