Abn logo
Sep 29 2021 @ 14:21PM

జగన్‌పై నోరు జారిన నాదెండ్ల.. పవన్ నవ్వులే నవ్వులు

గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేయడం చాలా బాధాకరమని నాదేండ్ల మనోహర్ అన్నారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సామాన్యులు వినలేని.. మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇదొక ఆనందమన్నారు. గతంలో కూడా తాను చాలా సందర్భాల్లో చూశానన్నారు. పనికిమాలిన.. ‘కొన్ని పదాలు నేను కూడా జాగ్రత్తగా మాట్లాడాలి’ అని నాదేండ్ల అనడంతో కార్యాలయంలో కార్యకర్తలు హర్షధ్వనులు చేయగా.. జనసేనాని పవన్ కల్యాణ్ చిరునవ్వులు చిందించారు. వైసీపీ నేతలు పనికిమాలిన వ్యక్తుల్ని రెచ్చగొట్టి అలజడి సృష్టించడానికి, సామాన్యలు ఇబ్బందిపడే విధంగా, భౌతికంగా దాడి చేసే విధంగా వ్యూహాలు వేస్తారని విమర్శివించారు.


యువతకు ప్రత్యేక ఉపాధి కల్పించబోతున్నామని ప్రచారం చేస్తూ ఈ ప్రభుత్వం అభూతకల్పన సృష్టించిందని నాదేండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వం దుర్మార్గపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలన చేశారా? ఏ జిల్లాకయినా వచ్చారా? అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తగు జాగ్రత్తలు తీసుకుని ఆస్పత్రికి వెళ్లి వైద్యసేవలను పరిశీలించారన్నారు. కోవిడ్ మరణాల్లో దేశంలో 4వ స్థానంలో ఏపీ నిలిచిందన్నారు. తుపానులు వచ్చినప్పుడు జగన్‌ ఎక్కడని నాదెండ్ల మనోహర్‌ నిలదీశారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...