నాడప్రభు కెంపేగౌడ ఎవరు? ఈయన భారీ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?

ABN , First Publish Date - 2022-07-04T13:13:45+05:30 IST

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో...

నాడప్రభు కెంపేగౌడ ఎవరు? ఈయన భారీ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో 108 అడుగుల నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు. ఇది మాత్రమే కాదు ఇక్కడి అసెంబ్లీలో కూడా నాడప్రభు మరొక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని  కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై ఇటీవల ప్రకటించారు. ఇంతకీ నాడప్రభు కెంపేగౌడ ఎవరు? బెంగుళూరుతో ఆయనకు ఉన్న సంబంధం ఏమిటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


నాడప్రభు కెంపేగౌడను బెంగళూరు వ్యవస్థాపకుడని అంటారు. 1513లో విజయనగర సామ్రాజ్య రాజు నాదప్రభు పాలన ప్రారంభమైంది. సుమారు 56 సంవత్సరాలు ఇక్కడ పాలించారు. 1537లో బెంగుళూరును రాజధానిగా చేయాలని నిర్ణయించుకున్నారు. నాడప్రభువు హయాంలో నగరంలో వేయికి పైగా చెరువులను నిర్మించి ప్రజలకు తాగునీరు, వ్యవసాయానికి నీటి కొరత లేకుండా చేశారు. ఈ నేపధ్యంలోనే అతని ఘనత గుర్తించి నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్‌కు కూడా అతని పేరు పెట్టారు. పాత నగరంలో కెంపేగౌడ పేరు మీద ఒక రహదారి కూడా ఉంది. బెంగళూరు విమానాశ్రయంలో ఆవిష్కరించనున్న కెంపేగౌడ విగ్రహం విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం. విమానాశ్రయంలోని 23 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన హెరిటేజ్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-04T13:13:45+05:30 IST