Dussehra: మైసూరులో గజరాజులకు శిక్షణ

ABN , First Publish Date - 2022-08-20T17:43:22+05:30 IST

మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనే గజరాజులకు తర్ఫీదు ప్రారంభమైంది. అంబారీని మోసే గజరాజు ‘అభిమన్యు’ తొలుత 300 కిలోల

Dussehra: మైసూరులో గజరాజులకు శిక్షణ

బెంగళూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనే గజరాజులకు తర్ఫీదు ప్రారంభమైంది. అంబారీని మోసే గజరాజు ‘అభిమన్యు’ తొలుత 300 కిలోల ఇసుకబస్తాలతో బయల్దేరింది. ప్యాలెస్(Palace)‏లోని బలరామ ద్వారం నుంచి బన్ని మండపం వరకు ఇతర ఏనుగులు(Elephants) కదిలాయి. ప్రతిరోజూ ప్యాలెస్‌ నుంచి కనీసం 5 కిలోమీటర్ల మేర పురవీధులలో గజరాజులు నడుస్తాయని డిప్యూటీ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (డీసీఎఫ్‌) కరికాలన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏనుగులకు బరువులు మోసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. క్రమేపీ 750 కిలోల బరువుకు పెంచి అలవాటు చేయనున్నట్టు తెలిపారు. అభిమన్యుతో కలసి అర్జున వెంటరాగా ఇతర గజరాజులు ముందుకు సాగాయి. సెప్టెంబరు మొదటివారంలో రెండోబ్యాచ్‌ ఏనుగుల బృందం వస్తుందన్నారు. 

Updated Date - 2022-08-20T17:43:22+05:30 IST