కొవిడ్‌-19 టెస్ట్‌ కిట్ల తయారీకి ‘మైల్యాబ్‌’ కృషి

ABN , First Publish Date - 2020-04-03T09:51:22+05:30 IST

పుణెకు చెందిన మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్‌ సంస్థ కొవిడ్‌ 19 టెస్టింగ్‌ కిట్లను అభివృద్ధి చేసింది. సీడీఎ్‌ససీ నుంచి వాణిజ్య అనుమతి పొందిన తొలి మేడిన్‌ ఇండియా కిట్లుగా...

కొవిడ్‌-19 టెస్ట్‌ కిట్ల తయారీకి ‘మైల్యాబ్‌’ కృషి

న్యూఢి ల్లీ, ఏప్రిల్‌ 2: పుణెకు చెందిన మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్‌ సంస్థ కొవిడ్‌ 19 టెస్టింగ్‌ కిట్లను అభివృద్ధి చేసింది. సీడీఎ్‌ససీ నుంచి వాణిజ్య అనుమతి పొందిన తొలి మేడిన్‌ ఇండియా కిట్లుగా అవి నిలిచాయి. వాటిని శరవేగంగా ఉత్పత్తి చేయడానికి సెరం ఇండియా సీఈవో అదర్‌ పూణావాలా, ఏపీజీ చైర్మన్‌ అభిజిత్‌ పవార్‌తో కలిసి పని చేయనున్నట్లు మైల్యాబ్‌ గురువారం తెలిపింది. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్ష చేయడానికి ఏడు గంటల సమయం పడుతుంది. మైల్యాబ్‌ అభివృద్ధి చేసిన కిట్‌ సాయంతో రెండున్నర గంటల్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష పూర్తి చేయొచ్చు.

Updated Date - 2020-04-03T09:51:22+05:30 IST