తరుగు లేకుండా కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2021-11-30T06:41:37+05:30 IST

తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశా రు.

తరుగు లేకుండా కొనుగోలు చేయాలి
దుబ్బాకలో మొలకెత్తిన ధాన్యంతో రోడ్డుపై పడుకున్న ఓ రైతు

రాస్తారోకో చేపట్టిన రైతులు  

జేసీ హామీతో ఆందోళన విరమణ

రామన్నపేట, నవంబరు 29: తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశా రు. మండలంలోని దుబ్బాక గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు బైఠాయించి మొలకెత్తిన ధాన్యంతో ధర్నా నిర్వహించారు. మిల్లర్లు క్వింటా వరి ధాన్యానికి 5 కేజీల కోత పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాడూరి జ్యో తి, రైతులు మాట్లాడుతూ వరి పంట కో సి 40 రోజులు దాటుతుండటంతో వర్షాల కు ధాన్యం నాని మొలకెత్తాయని అన్నా రు. ఇప్పటి వరకు ఐకేపీ కేంద్రంలో 7 లారీల ధాన్యమే తీసుకెళ్లారని, అందులో కూడా 5 కేజీల చొప్పున మిల్లర్లు కోత వి ధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వి షయం తెలుసుకున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోత విధించకుండా చర్యలు తీసుకుంటామని, రైతులు ఇబ్బందులు పడవద్దని హామీ ఇచ్చారు. కొనుగోలు వేగవం తం చేస్తామని జేసీ భరోసా ఇవ్వడంతో  రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు ఇట్టె రాము లు, ధనుంజయ, పి.వెంకటేశ్వరరావు, సోమేశ్వర్‌రావు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసీ 

ఎన్నారం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని జేసీ శ్రీనివాస్‌రెడ్డి ఆకస్మికంగా సందర్శించి ధాన్యం రాశులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మిల్లులో బస్తాకు క్విం టాల్‌కు 5 కిలోల చొప్పున తగ్గిస్తున్నారని, డబ్బులు ఇస్తే నే లారీల్లో లోడు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రై తులు ఆందోళన చెందవద్దని, తడి లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలని జేసీ రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్‌కుమార్‌, అధికారులు బ్రహ్మరా వు, గోపికష్ణ, తహసీల్దార్‌ ఆంజనేయులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్‌ ఎదుట వైసీపీ ధర్నా 

భువనగిరిరూరల్‌: రైతులు పం డించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వైసీపీ పార్లమెంట్‌ ని యో జకవర్గ కో కన్వీనర్‌ మహ్మద్‌ అతహర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు ఆరుగాలం శ్ర మించి పండించిన వరిని కొనుగోలు చే యకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాలవర్షం తో ధాన్యం మొలకెత్తి రంగు మారిందని అన్నారు. నాణ్యత సాకుతో నిర్వాహకులు, రైస్‌ మిల్లర్లు బస్తాకు 2 నుంచి 3 కిలోల ధాన్యానికి కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోనికి చొచ్చుకెళ్తుండగా భువనగిరిరూరల్‌ సీఐ జా నయ్య, ఎస్‌కె సైదులు పోలీసు బందోబస్తుతో వారిని అ డ్డుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఇరుగు సునీల్‌కుమార్‌, రమే్‌షగౌడ్‌, సమ్మయ్య, లింగారెడ్డి, గణే ష్‌నాయక్‌, మోడెపు జీవన, మంజుల, వసంత, రమేష్‌, శ్రీనివా్‌సనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-30T06:41:37+05:30 IST