విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-01-29T04:56:24+05:30 IST

పోలీసులు విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌తోపాటు రూడకోట సీఆర్‌పీఎఫ్‌ పోలీస్‌ అవుట్‌ పోస్టును ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
ఎస్‌ఐలు, సీఐతో మాట్లాడుతున్న ఎస్పీ కృష్ణారావు


 జిల్లా ఎస్పీ కృష్ణారావు 

ముంచంగిపుట్టు, జనవరి 28: పోలీసులు విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌తోపాటు రూడకోట సీఆర్‌పీఎఫ్‌ పోలీస్‌ అవుట్‌ పోస్టును ఆయన ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ భద్రతా వలయాన్ని, రికార్డులను ఎస్పీ పరిశీలించారు. అలాగే రూడకోట సీఆర్‌పీఎఫ్‌ పోలీస్‌ అవుట్‌ పోస్టును సందర్శించి పలు సలహాలు, సూచనలను చేశారు. ప్రస్తుతం మండలంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. అనుక్షణం అప్రమత్తంగా విధులను నిర్వహించాలని, ఎక్కడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  పాడేరు సీఐ సుధాకర్‌, ముంచంగిపుట్టు ఎస్‌ఐ ఆర్‌.సంతోష్‌, పెదబయలు ఎస్‌ఐ మనోజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-29T04:56:24+05:30 IST