మట్టి కొట్టేసి..

ABN , First Publish Date - 2020-06-07T07:15:30+05:30 IST

ముసునూరు మండలానికి చెందిన రమణక్కపేట, గోపవరం, చింతలవల్లి గ్రామాల్లోని చెరు వుల్లో అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది.

మట్టి కొట్టేసి..

నూజివీడు : ముసునూరు మండలానికి చెందిన రమణక్కపేట, గోపవరం, చింతలవల్లి గ్రామాల్లోని చెరు వుల్లో అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. చెరువుల నుంచి మట్టి తరలి వెళ్తోందని అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడు లేడు. ఈ దోపిడీ రాత్రిపూట యథేచ్ఛగా సాగుతోంది. మట్టి తోలకాలకు అనుమతులు ఉంటే.. పగటి పూటే నిబంధనల మేరకు తరలించాలి. అందుకు విరుద్ధంగా రాత్రిపూట తవ్వకాలు చేపట్టడం అనుమానాలకు తావి స్తోంది. గోపవరం చెరువు నుంచి టిప్పర్ల ద్వారా మట్టి తోల కాలు జరగడాన్ని బట్టి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలుస్తోంది. 


ఇదేమిటని ప్రశ్నించడానికి వెళ్లిన వ్యక్తిపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దుర్భాషలాడారు. రమణక్కపేటలో మట్టి తోలకాలను చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు శనివారం ముసునూరు పోలీస్‌స్టేషన్‌లో ఉంచడాన్ని బట్టి అధికారులు ఎవరికి కొమ్ము కాస్తున్నారో అర్థమవుతోంది. తమ్మిలేరు వాగులో బలివే, యల్లాపురం ర్యాంపుల నుంచి ఇసుక తోలకాలకు అనుమతులు ఉన్నాయి. ఈ ర్యాంపుల నుంచి రోజూ వందలాది ట్రాక్టర్ల ఇసుక తరలివెళ్తోంది. అఽధికారికంగా ఇచ్చిన అనుమతుల కంటే పెద్దసంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఇసుక తోలకాలు స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 

Updated Date - 2020-06-07T07:15:30+05:30 IST