పెడన : మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపూర్ శర్మ, నవీన్ జిం దాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జామియా మసీదు కమిటీ, ముస్లిం మైనారిటీ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం పెడనలో ర్యాలీ నిర్వహించారు. గృహ నిర్మాణ మంత్రి జోగి రమేష్, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వివిధ సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మ, నవీన్ జిందాల్లను కఠినంగా శిక్షించాలని కోరుతూ ముస్లిం నాయకులు పోలీసు స్టేషన్లో వినతిపత్రం అందజేశారు.