అల్లూరి స్మృతులతో మ్యూజియం : మంత్రి రోజా

ABN , First Publish Date - 2022-07-02T06:23:57+05:30 IST

అల్లూరి సీతారామరాజు స్మృతులతో రాష్ట్రంలో 22 ఎకరాల్లో మ్యూజియం ఏర్పాటు చేయ నున్నట్లు మంత్రి రోజా పేర్కొన్నారు.

అల్లూరి స్మృతులతో మ్యూజియం : మంత్రి రోజా
విగ్రహాన్ని ప్రారంభిస్తున్న మంత్రి రోజా

పుత్తూరు, జూలై 1: అల్లూరి సీతారామరాజు స్మృతులతో రాష్ట్రంలో 22 ఎకరాల్లో మ్యూజియం ఏర్పాటు చేయ నున్నట్లు మంత్రి రోజా పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన అల్లూరి సీతామరాజు జయంతిని పురస్కరించుకుని జూన్‌ 28 నుంచి జూలై 4 వరకు వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పుత్తూరు-చెన్నై రహదారిలోని సాయిబాబా ఆర్చి సమీపంలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. వడమాలపేట మండలం పూడి క్రాస్‌ నుంచి సాయిబాబా గుడి వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి స్వయంగా బైక్‌ నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అల్లూరి వేషధారణలో కొందరు స్త్రీలు ఆకట్టుకున్నారు. ఏకపాత్రాభినయం, బుర్రకథ, నృత్య ప్రదర్శనలతో చిన్నారులు అలరించారు. వైఎస్‌ఆర్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. రోజా మాట్లాడుతూ అల్లూరి చైతన్య స్ఫూర్తితో ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ జిల్లాకు అల్లూరి పేరు పెట్టడమేగాక ఆయన కోరుకున్న విధంగా ప్రజలకు విద్య, వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్లు హరి, నీలమేఘం, వైస్‌ చైర్మన్లు జయప్రకాష్‌, క్షత్రియ సంఘం నాయకులు ప్రసాద్‌రాజు, శివరాజువర్మ, హరికృష్ణ, సీతారామరాజు, సురేష్‌రాజు, కృష్ణంరాజు, రామచంద్రరాజు, ప్రసాద్‌వర్మ, చంద్రారెడ్డి, వేణుగోపాల్‌రాజు, శేఖర్‌రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:23:57+05:30 IST