ప్రభుత్వ భవనాలకు స్థలాలు సేకరించండి

ABN , First Publish Date - 2020-07-09T11:11:06+05:30 IST

ప్రభుత్వ భవనాలకు వెంటనే స్థలాలు సేకరించాలని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టర్‌ చాంబర్‌లో వివిధ శాఖల

ప్రభుత్వ భవనాలకు స్థలాలు సేకరించండి

నాడు-నేడు పనులు వేగవంతం 

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స


కలెక్టరేట్‌, జూలై 8: ప్రభుత్వ భవనాలకు వెంటనే స్థలాలు సేకరించాలని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టర్‌ చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక, సిమెంట్‌ కొరత ఉందని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.


ఇసుకకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు వస్తాయని, వాటికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. 34 మంది ఇంజనీర్లకుగాను 17 మంది ఉన్నారని ఎస్‌ఈ చెప్పగా డిప్యూ టేషన్‌పై నియమించే అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి రూ.20 కోట్లు రావాల్సి ఉందని డ్వామా పీడీ ప్రస్తావించగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి పనులను ఎక్కువ మందికి కల్పించామన్నారు. అంతకు ముందు హరే కృష్ణ మూవ్‌మెంట్‌, అక్షయ పాత్ర పౌండేషన్‌ సేవలను మంత్రి ప్రశంసించారు. డ్రై రేషన్‌ కిట్స్‌ పంపిణీ చేశారు. పాడి రైతులకు ప్రశంసా పత్రాలు, పశుఆరోగ్య సంరక్షణ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరభద్రస్వామి, జేసీలు కిషోర్‌, కూర్మనాథ్‌, డీఆర్‌వో వెంకటరావు, అదనపు ఎస్‌పీ శ్రీదేవిరావు తదితరులు పాల్గొన్నారు. 


సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

రైతు దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆ సమయంలో ఎల్‌.కోట మండలం కాసాపేటకు చెందిన రైతు మాధవరావుతో సీఎం మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న  కార్యక్రమాలను ఆయన వివరించారు. 

Updated Date - 2020-07-09T11:11:06+05:30 IST