సమీర్ వాంఖడేపై ముంబై పోలీసుల Inquiry ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-28T13:00:23+05:30 IST

నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నలుగురు పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని...

సమీర్ వాంఖడేపై ముంబై పోలీసుల Inquiry ప్రారంభం

 నలుగురు సభ్యులతో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు

ముంబై: నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నలుగురు పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ముంబై పోలీసు జాయింట్ కమిషనర్ విశ్వాస్ నాంగ్రే పాటిల్ ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు కమిషనర్ (ఏసీపీ) దిలీప్ సావంత్ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.నలుగురు సభ్యుల బృందంలో ఆజాద్ మైదాన్, కొలాబా పోలీస్ స్టేషన్ల నుంచి ఒక్కొక్క అధికారి, ముంబై పోలీసుల యాంటీ నార్కొటిక్స్ సెల్ నుంచి ఒక అధికారి,  ఫోర్స్ సైబర్ సెల్ నుంచి ఒక అధికారి ఉన్నారు. 


సమీర్ వాంఖడే కు వ్యతిరేకంగా వచ్చిన 4 ఫిర్యాదులను కలిపి దర్యాప్తు ప్రారంభించామని ముంబై పోలీసులు చెప్పారు. అధికారి సమీర్ వాంఖడే అవినీతిపై ప్రభాకర్ సెయిల్, సుధా ద్వివేది, కనిష్క్ జైన్, నితిన్ దేశ్‌ముఖ్ లు నాలుగు వేర్వేరు ఫిర్యాదులు చేశారు.మరో వైపు అవినీతి ఆరోపణలపై సమీర్ వాంఖడేను బుధవారం ఎన్‌సీబీ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రశ్నించింది. నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను విడిచిపెట్టడానికి మరో స్వతంత్ర సాక్షి కేపీ గోసావి,సామ్ డిసౌజాలు రూ. 25 కోట్ల పే-ఆఫ్ స్కీమ్ గురించి చర్చించడం విన్నట్లు సెయిల్ పేర్కొన్నాడు.


ఈ మేర సెయిల్ గత వారం అఫిడవిట్‌ దాఖలు చేశారు.ఈ మొత్తంలో రూ.8 కోట్లు ఆర్యన్‌ఖాన్‌ కేసు ఇన్‌ఛార్జ్‌ అధికారి సమీర్‌ వాంఖడేకు చేరాయని ప్రభాకర్‌ సెయిల్‌ పేర్కొన్నారు.సెయిల్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఎన్సీబీ విజిలెన్స్ విభాగానికి చెందిన బృందం బుధవారం ముంబైలోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ కార్యాలయంలో వాంఖడేను నాలుగు గంటలకు పైగా ప్రశ్నించింది.


Updated Date - 2021-10-28T13:00:23+05:30 IST