Abn logo
Aug 10 2020 @ 02:15AM

బిహార్‌ పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగారు!

  • కేసును సీబీఐకి అప్పగించ వద్దు
  • సుశాంత్‌ కేసులో ‘సుప్రీం’ను కోరిన ముంబై పోలీసులు

న్యూఢిల్లీ, ఆగస్టు 9: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో బిహార్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం సరికాదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ముంబై పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసును తాము దర్యాప్తు చేస్తున్నామని, ఇలాంటి స్థితిలో తమ జ్యూరి్‌సడిక్షన్‌ పరిధిని దాటి మరీ బిహార్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయడం చూస్తుంటే.. వారు రాజకీయ ఒత్తిళ్లకు లొంగినట్లు కనిపిస్తోందని వివరించారు. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసును బిహార్‌ నుంచి ముంబైకి మార్చాల్సిందిగా రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌పై శనివారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ముంబై పోలీసులు... తమ దర్యాప్తు సాగుతున్నందున ఇతర దర్యాప్తు సంస్థలను అనుమతించవద్దని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో ముంబై పోలీసుల తీరును తప్పుబడుతూ సుశాంత్‌ తండ్రి సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ దాఖలు చేశారు.  


Advertisement
Advertisement
Advertisement