ముంబైలో 10వేలు దాటిన కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-10-25T13:18:26+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని నగరంగా పేరొందిన ముంబైలో కరోనా మహమ్మారి వల్ల 10వేల మందికి పైగా రోగులు....

ముంబైలో 10వేలు దాటిన కరోనా మరణాలు

ముంబై (మహారాష్ట్ర): దేశ ఆర్థిక రాజధాని నగరంగా పేరొందిన ముంబైలో కరోనా మహమ్మారి వల్ల 10వేల మందికి పైగా రోగులు మరణించారు. గడచిన 24 గంటల్లో ఒక్క ముంబై నగరంలోనే 1257 కరోనా కేసులు నమోదు కాగా, వీరిలో 50 మంది మరణించారు. దీంతో ముంబైలో కరోనా మృతుల సంఖ్య 10.016కు పెరిగింది. ముంబై నగరంలోనే 2,50,061 మందికి కరోనా సోకగా, రోగుల రికవరీ శాతం 88 శాతంగా ఉంది. ప్రస్థుతం ముంబైలో 19,500 కరోనా క్రియాశీల కేసులున్నాయి.50 ఏళ్లు పైబడిన వారిలో 85 శాతం మరణాలు నమోదైనాయి. 


నగరంలో 633 యాక్టివ్ కరోనా కంటైన్ మెంట్ జోన్లతోపాటు 8,585 భవనాలకు సీలు వేశారు.మహారాష్ట్రలో రోగుల రికవరీ రేటు 88.78 శాతంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ట్వీట్‌లో పేర్కొన్నారు.మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం 16,38,961 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇన్ఫెక్షన్ నుంచి  14,55,107 మంది రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో 43,152 మంది మరణించారు.

Updated Date - 2020-10-25T13:18:26+05:30 IST