కొవిడ్‌ నిబంధనల మేరకు ముక్కోటి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-11-28T04:47:57+05:30 IST

కొవిడ్‌ నిబంధనల మేరకు ముక్కోటి ఏర్పాట్లు

కొవిడ్‌ నిబంధనల మేరకు ముక్కోటి ఏర్పాట్లు
సమీక్షలో మాట్లాడుతున్న ఇన్‌చార్జ్‌ సబ్‌కలెక్టర్‌ గౌతమ్‌, హాజరైన అధికారులు

నిర్ణీత సమయంలో పూర్తికావాలి

ఏకాదశి సమీక్షలో అధికారులకు సబ్‌కలెక్టర్‌ ఆదేశాలు

భద్రాచలం, నవంబరు 27: కొవిడ్‌-19ను దృష్టిలో ఆ నిబంధనల మేరకు ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో, ఇన్‌చార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ పోత్రు గౌతమ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం సాయం త్రం భద్రాచలం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ముక్కోటి ఉత్సవాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ టీవీ లు, లైటింగ్‌, బారికేడింగ్‌ ఏర్పాట్లను పర్యవేక్షణ చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు సూచించారు. భక్తు లు గోదావరిలో దిగకుండా భద్రాచలంతో పాటు పర్ణశాలలో కూడా బారికేడింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు నదిలోతు సూచికలు ఏర్పాటు చేయాలని అన్నారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు, గతంలో ఉన్నవాటికి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఆదేశించారు. డిసెంబరు 24, 25లో విద్యుత్తు సరఫరాలో ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అవసరమైతే జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. వాహనాల పార్కింగ్‌ చేసేందుకు వీలుగా ప్రాంతాలను తెలియజేయాలని, స్వామి వారికి ని ర్వహించే పూజలను భక్తులు వీక్షించడానికి ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చే యాలని ఈవోకు ఆదేశించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో శివాజీ, ఏడీఎంఅండ్‌హెచ్‌వో శ్రీనివాసు, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ ప్రసాద్‌, ఆర్టీసీ డీఎం శ్రీనివాస్‌, డీపీవో పవన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T04:47:57+05:30 IST