రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా ముక్తార్ అబ్బాస్ నఖ్వి

ABN , First Publish Date - 2021-07-19T20:54:16+05:30 IST

రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ ముక్తార్ అబ్బాస్ నఖ్వి..

రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా ముక్తార్ అబ్బాస్ నఖ్వి

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ ముక్తార్ అబ్బాస్ నఖ్వి నియమితులయ్యారు. రాజ్యసభ సభానేత (లీడర్ ఆఫ్ హౌస్)గా పీయూష్ గోయల్ నియమితులు కావడంతో, ఆయన స్థానంలో డిప్యూటీ లీడర్‌గా నఖ్వి నియామకం జరిగింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి నఖ్వికి పార్లమెంటరీ వ్యవహారాలపై విశేషానుభవం ఉంది. మోదీ తొలి ఐదేళ్ల పాలనలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఆయన సేవలందించారు. అనేక అంశాలపై అధికార పక్షాన్ని సభలో నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్న తరుణంలో వివిధ పార్టీల నేతలతో సుహృద్భావ సంబంధాలున్న నఖ్విని డిప్యూటీ లీడర్‌గా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కోవిడ్ సెకెండ్ వేవ్, ఇంధనం ధరల పెరుగుదల, రైతుల ఆందోళన వంటి అంశాలను విపక్షాలు ఈసారి ప్రధాన అస్త్రాలుగా ఎంచుకున్నాయి.

Updated Date - 2021-07-19T20:54:16+05:30 IST