కనీస మద్దతు ధరను ముట్టుకోం.. రైతులకు తోమర్ హామీ...

ABN , First Publish Date - 2020-12-04T03:38:15+05:30 IST

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని ముట్టుకోబోమనీ.. దానికి ఎలాంటి మార్పులు చేయబోమని రైతులకు కేంద్ర వ్యవసాయ...

కనీస మద్దతు ధరను ముట్టుకోం.. రైతులకు తోమర్ హామీ...

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని ముట్టుకోబోమనీ.. దానికి ఎలాంటి మార్పులు చేయబోమని రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హామీ ఇచ్చారు. విజ్ఞాన్ భవన్‌లో ఇవాళ రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల సందర్భంగా ఆయన ఈమేరకు పేర్కొన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేపట్టిన రైతు సంఘాల నేతలతో గురువారం వరుసగా నాలుగో రోజు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాల కారణంగా ఎంఎస్పీ వ్యవస్థ కనుమరుగవుతుందంటూ రైతులు కొద్దిరోజులుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఎంఎస్‌పీకి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదంటూ కేంద్ర పదేపదే చెబుతూ వస్తోంది. మరోవైపు దీనిపై రాతపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులతో గురువారం కేంద్రం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో.. తదుపరి చర్చలను ఈ నెల 5కు వాయిదా వేశారు. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం-2020, రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020, నిత్యవసర సరకుల(సవరణ) చట్టం- 2020 సహా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించు కోవాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2020-12-04T03:38:15+05:30 IST