ఈ యూట్యూబర్ విన్యాసం చూస్తే హడలెత్తిపోవాల్సిందే!

ABN , First Publish Date - 2021-04-03T11:48:22+05:30 IST

ఇటీవల ఒక యూట్యూబర్‌కు చెందిన వీడియో తెగ వైరల్‌గా...

ఈ యూట్యూబర్ విన్యాసం చూస్తే హడలెత్తిపోవాల్సిందే!

వాషింగ్టన్: ఇటీవల ఒక యూట్యూబర్‌కు చెందిన వీడియో తెగ వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. అమెరికాకు చెందిన యూ ట్యూబర్ మిస్టర్ బీస్ట్ 50 గంటల పాటు సమాధి స్థితిలో ఉన్నాడు. మిస్టర్ బీస్ట్ పేరుతో ఫేమస్ అయిన జిమ్మీ డోనాల్డ్సన్‌కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఈ వీడియోలో 50 గంటలపాటు తాను సమాధిలో ఎలా ఉన్నాడో మిస్టర్ బీస్ట్ చూపించాడు. అద్దాల శవపేటికలో అమర్చిన కెమెరాలు మిస్టర్ బీస్ట్‌ను వివిధ యాంగిల్స్‌లో రికార్డు చేశాయి. రెండు రోజుల పాటు భూమిలోపల శవ పేటికలో ఉన్న మిస్టర్ బీస్ట్ తన వద్దనున్న డివైజ్‌ సాయంతో  స్నేహితులతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ సమాధిలోపల బీస్ట్ ఒక దుప్పటి, కొన్ని ఆహార పదార్థాలు ఏర్పాటు చేసుకున్నాడు. మిస్టర్ బీస్ట్ పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ ఐదున్నర కోట్లమందికిపైగా చూశారు. 

                                                   మిస్టర్ బీస్ట్ సౌజన్యంతో...

Updated Date - 2021-04-03T11:48:22+05:30 IST