రాహుల్ ముందుకు రాకపోతే ఎన్నికలు పెట్టండి : శశి థరూర్

ABN , First Publish Date - 2020-08-13T00:55:13+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీ చేపట్టకపోతే మాత్రం ఆ పదవికి ఎన్నికలను నిర్వహించాలని

రాహుల్ ముందుకు రాకపోతే ఎన్నికలు పెట్టండి : శశి థరూర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీ చేపట్టకపోతే మాత్రం ఆ పదవికి ఎన్నికలను నిర్వహించాలని ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత శశి థరూర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సీడబ్ల్యూసీ పదవుల విషయంలోనూ అదే పంథా కొనసాగించాలని నిర్మొహమాటంగా చెప్పారు.  కాంగ్రెస్ ప్రజల మనసుల్లో ఓ విశ్వసనీయమైన ప్రతిపక్షంగా గూడు కట్టుకొని ఉందని, వెంటనే పూర్తి కాలపు అధ్యక్షుడి నియామకం జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.


ఇలా అధ్యక్ష విషయం ఓ కొలిక్కి వస్తే...పార్టీ కేడర్, నిర్మాణం తదితర అంశాలపై పూర్తి స్థాయి దృష్టి నిలిపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇంతటి క్లిష్ట సమయంలోనూ పూర్తి కాలపు అధ్యక్షులు లేకపోవడం ఇబ్బందని, వెంటనే ఆయన తన నిర్ణయాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు.


2022 వరకూ అధ్యక్ష బాధ్యతల్లో రాహుల్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ఇది సాధ్యం కాకపోతే మాత్రం... వేరొక పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలని అన్నారు. నెహ్రూ- గాంధీ కుటుంబాలపై కాంగ్రెస్ కార్యకర్తలకు అపారమైన నమ్మకం ఉందని, అంతేకాకుండా వివిధ రకాలైన సమూహాలను కాంగ్రెస్ వైపు ఆకర్షించారని ఆయన తెలిపారు. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని నడపడంలోనూ బాగా సక్సెస్ అయ్యారని, ఇప్పటికీ కొన్ని సమూహాలను కాంగ్రెస్ తో నడిపించడంలో గాంధీ కుటుంబం విజయవంతమైందని థరూర్ తెలిపారు. 

Updated Date - 2020-08-13T00:55:13+05:30 IST