మినీ జూ ఏర్పాటుకు రూ. 50 లక్షలు మంజూరు: ఎంపీ సంతోష్

ABN , First Publish Date - 2022-03-22T23:37:05+05:30 IST

హైదరాబాద్‌: మహబూబ్ నగర్ జిల్లాలో విత్తన బంతులను తయారు చేసి అతి పెద్ద వాక్యంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన సందర్భంగా అవార్డును గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితమిచ్చారు.

మినీ జూ ఏర్పాటుకు రూ. 50 లక్షలు మంజూరు: ఎంపీ సంతోష్

హైదరాబాద్‌: మహబూబ్ నగర్ జిల్లాలో విత్తన బంతులను తయారు చేసి అతి పెద్ద వాక్యంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన సందర్భంగా అవార్డును గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితమిచ్చారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో గిన్నిస్ సర్టిఫికెట్‌ల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలో 2087 ఎకరాలలో కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ను చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారని ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో మినీ జూ ఏర్పాటు చేసేందుకు తన నిధుల నుంచి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సంతోష్ కుమార్ ప్రకటించారు. జిల్లా మహిళా సంఘాలు 2023లో 3 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం 2 కోట్ల 8 లక్షల 24 వేల  విత్తన బంతులను మహిళా సంఘాలు తయారుచేసి చల్లారని చెప్పారు. జిల్లాకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం గర్వకారణమన్నారు. 




Updated Date - 2022-03-22T23:37:05+05:30 IST