విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి : ఎంపీ

ABN , First Publish Date - 2020-07-09T12:12:51+05:30 IST

విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని, ముఖ్యంగా మైనార్టీల విద్యాభివృద్ధికి కట్టుబడి..

విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి : ఎంపీ

వేంపల్లె, జూలై 8: విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని, ముఖ్యంగా మైనార్టీల విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. వేంపల్లెకు ఉర్దూ జూనియర్‌ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా.. నూత న భవన  నిర్మాణాలకు రూ.3.50కోట్లు మంజూరు చేశారు. ఈ విద్యాసంవత్సరంలో తాత్కాలికంగా మెయిన్‌ బజార్‌లోని ప్రభు త్వ పాఠశాల పై గదుల్లో నిర్వహణకు, కళాశాల అధికారులు ఏర్పాట్లు చేయ గా బుధవారం ఎంపీ  అవినాష్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి, వైసీపీ కన్వీనర్‌ చంద్ర ఓబుళరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్‌ వల్లితో కలిసి ప్రారంభించారు. వచ్చే విద్యాసంవత్సరానికి శాశ్వత భవనాల్లోకి వెళ్లేలా పూర్తి చేయాలని స్థానిక నాయకులకు సూచించారు.    కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ కన్వీనర్‌ మునీర్‌, షాదీఖానా చైర్మన్‌ షెక్షావల్లి, మటన్‌బాబా, హకీం, మాజీ జడ్పీటీసీ డాక్టర్‌ బాష, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 


తాగునీటి సమస్యకు సత్వర పరిష్కారం

వేంపల్లెలో తాగునీటి సమస్యకు సత్వర పరిష్కారం చూపుతామని, అవసరమైతే మరిన్ని బోర్లు వేస్తామని ఎంపీ  అవినాష్‌రెడ్డి తెలిపారు. వేంపల్లె మెయిన్‌ బజార్‌లోని పాఠశాల వద్ద వేసిన నూతన బోరును ఎంపీ బుధవారం ప్రారంభించారు.  కాగా  జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లోని సమస్యలపై ఎంపీ అవినా్‌షరెడ్డికి ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జోగిరామిరెడ్డి వినతిపత్రం సమర్పించారు.  ఆసంఘం ప్రతినిధులు రామాంజనేయరెడ్డి, నారాయణరెడ్డి నజీర్‌, కేశవులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-09T12:12:51+05:30 IST