అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు: ఎంఆర్‌పీఎస్‌

ABN , First Publish Date - 2022-07-03T04:45:32+05:30 IST

అక్రమ అరెస్టులతో ఉద్య మాలను ఆపలేరని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్‌) జాతీయ నాయకుడు రా మాంజనేయులు మాదిగ అన్నారు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు: ఎంఆర్‌పీఎస్‌
రాయచోటి: పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ధర్నా చేస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నేతలు

రాయచోటిటౌన్‌, జూలై 2: అక్రమ అరెస్టులతో ఉద్య మాలను ఆపలేరని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్‌) జాతీయ నాయకుడు రా మాంజనేయులు మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ  పట్టణంలోని నేతాజీ సర్కిల్‌ వద్ద నిర్వహిస్తున్న సడక్‌ బంద్‌ ను  పోలీసులు అడ్డుకుని రామాంజనేయులుతో పాటు బండకింద మనోహర్‌, రామయ్య తదితరులను  అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ ఎంఆర్‌పీఎస్‌ నేతలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద బైఠాయించి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానా లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ వర్గీకర ణకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించే వరకు ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు.  ఈ కార్యక్ర మంలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు తిరుపాల్‌, రాజా, సుబ్బయ్య, లావణ్య, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

సుండుపల్లె: ఎస్సీ వర్గీకరణ చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం దారు ణమని మండల ఎంఆర్‌పీఎస్‌ అధ్య క్షుడు నాగరాజు మాదిగ, డీవీఎప్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వీరనాగయ్య, మండల ఎంఆర్‌పీఎస్‌ కార్యదర్శి నాగలేసు మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకపోవడం దారుణమన్నారు. ఇందుకు నిరసన గా జూలై రెండో తేదీ తలపెట్టిన సడక్‌ బంద్‌కు వెళ్లేందుకు వీలు లేకుండా  పోలీసులు అరెస్టు చేశా రని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులతో ఉద్యమాల ను ఆపలేరని ఎస్సీ వర్గీకరణ జరిగేంతవరకు పోరాటాలు ఆగవని వారు తెలిపారు. 


Updated Date - 2022-07-03T04:45:32+05:30 IST