Abn logo
Jul 31 2021 @ 18:35PM

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

ఉత్తరప్రదేశ్: 22 ఏళ్ల యువతి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆగ్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. హత్రాస్‌కు చెందిన ఆ యువతిని కాన్పు కోసం ఆగ్రాలోని ఆస్పత్రిలో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమె ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చారు. తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.