బిడ్డకు మొదటి టీకా తల్లి పాలే

ABN , First Publish Date - 2021-08-03T05:30:00+05:30 IST

బిడ్డకు మొదటి టీకా తల్లి పాలేనని, ఆ పాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండి బిడ్డకు రక్షణ కల్పిస్తుందని సీనియర్‌ గైనకాలజిస్టు డాక్టర్‌ జె. లిటోర్నదేవి అన్నారు.

బిడ్డకు మొదటి టీకా తల్లి పాలే
తల్లిపాల వారోత్సవాల్లో మాట్లాడుతున్న డాక్టర్‌ లిటోర్నదేవి

సీనియర్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ లిటోర్నదేవి

ఏలూరు క్రైం, ఆగస్టు 3 : బిడ్డకు మొదటి టీకా తల్లి పాలేనని, ఆ పాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండి బిడ్డకు రక్షణ కల్పిస్తుందని సీనియర్‌ గైనకాలజిస్టు డాక్టర్‌ జె. లిటోర్నదేవి అన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా న్యూట్రీషియన్‌  రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వాసు పత్రిలో తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  బిడ్డ పుట్టిన గంటలోపే ప్రతి తల్లి బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని, ఆ పాలలో కొలెస్ర్టామ్‌ ఎక్కువగా ఉంటుందని తద్వారా బిడ్డకు వ్యాధి నిరోధకశక్తి అధికమై అంటువ్యాధుల బారిన పడకుండా రక్షణ లభిస్తుందన్నారు. బిడ్డకు ఆరు మాసాలు వచ్చే వరకు తల్లిపాలే ఇవ్వాలన్నారు. చిల్డ్రన్‌ స్పెషలిస్టు డాక్టర్‌ ఎం.ప్రియదర్శిని మాట్లాడు తూ ప్రతి తల్లి తమ బిడ్డలకు అన్ని రకాల టీకాలు వేయించాలన్నారు. డైటీషి యన్లు పి. సౌజన్య పావని, గౌతమీ అపూర్వ తల్లిపాల ప్రాముఖ్యతను స్లైడ్స్‌ రూపంలో అవగాహన కల్పించారు. బాలింతలు కొవిడ్‌ టీకా వేయించుకున్నప్ప టికీ బిడ్డకు పాలివ్వవచ్చన్నారు. బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు. 

తల్లి పాలే బిడ్డకు శ్రేష్ఠం

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 3 : తల్లిపాలే బిడ్డకు శ్రేష్టం అని ఏఎన్‌ఎంలు రెహమున్నీసా బేగం, కామేశ్వరి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం తంగెళ్ళమూడి, గవర్లపేట అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు ఇస్తే శిశువు అనేక అంటురోగాల బారిన పడకుండా రక్షణ ఉంటుందన్నారు. అసిస్టెంట్‌ మలేరియా అధికారి గోవిందరావు, అంగన్‌వాడీ వ ర్కర్లు భాగ్యలక్ష్మి, రత్నకుమారి, నాగేశ్వరి, ఆశా వర్కర్లు ఉమాదేవి పాల్గొన్నారు.

పోషక లోపాలు అమ్మపాలతోనే భర్తీ..

దెందులూరు, ఆగస్టు 3 :శిశువుల్లో పోషక లోపాలు అమ్మపాలతోనే భర్తీ అవుతాయని, చిన్నారుల ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత కీలకమని దెందు లూరు అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ ఎం.కుమారి తెలిపారు. అంగన్వఆడీ కోడ్‌ నెంబర్‌ 114లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఆమె ప్రారం భించారు. గర్భిణులకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందించే బాలామృతం వంటి సదుపా యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

Updated Date - 2021-08-03T05:30:00+05:30 IST