Watch: నిద్రిస్తున్న చిన్న ఏనుగును లేపడానికి తల్లి విశ్వ ప్రయత్నం.. ఎంతకీ లేవకపోవడంతో ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-07-09T01:14:56+05:30 IST

గాఢంగా నిద్రపోతున్న పిల్లలను మేల్కొలపడం ఏ తల్లికైనా కష్టమే. ఒక పట్టాన నిద్రలేవని పిల్లలను లేపేందుకు

Watch: నిద్రిస్తున్న చిన్న ఏనుగును లేపడానికి తల్లి విశ్వ ప్రయత్నం.. ఎంతకీ లేవకపోవడంతో ఏం చేసిందంటే..

గాఢంగా నిద్రపోతున్న పిల్లలను మేల్కొలపడం ఏ తల్లికైనా కష్టమే. ఒక పట్టాన నిద్రలేవని పిల్లలను లేపేందుకు తల్లులు పడే కష్టం ప్రతి ఇంట్లోనూ కనిపించే దృశ్యమే. తాజాగా ఓ తల్లి ఏనుగుకు కూడా ఇదే సమస్య ఎదురైంది. ఎంత లేపినా పిల్ల ఏనుగు నిద్ర లేవలేదు. దీంతో ఆ ఏనుగు మనుష్యుల సహాయం తీసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 


Buitengebieden అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రకారం.. జంతు ప్రదర్శనశాలలో ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగును నిద్ర నుంచి లేపడానికి ప్రయత్నిస్తోంది. అయితే తల్లి ఎంత ప్రయత్నించినా ఆ ఏనుగు పిల్ల మాత్రం లేవలేదు. దీంతో తల్లి ఏనుగు తన బిడ్డ నిద్ర చెడగొట్టేందుకు జూ కీపర్లను పిలిచింది. వారు ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి పిల్ల ఏనుగును నిద్రలేపారు. నిద్ర లేచిన పిల్ల ఏనుగు వెంటనే తల్లి దగ్గరకు పరిగెత్తింది. ఈ వీడియో ఇప్పటికే 44 లక్షకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-09T01:14:56+05:30 IST