Military Academy: ఆ తల్లికి పుత్రోత్సాహం.. ఈ ఫొటో వెనుక కథ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-01T21:13:43+05:30 IST

మేజర్ స్మితా చతుర్వేది (Major Smita Chaturvedi).. రిటైర్డ్ ఆర్మీ అధికారి.

Military Academy: ఆ తల్లికి పుత్రోత్సాహం.. ఈ ఫొటో వెనుక కథ ఏంటంటే..

మేజర్ స్మితా చతుర్వేది (Major Smita Chaturvedi).. రిటైర్డ్ ఆర్మీ అధికారి. 27 ఏళ్ల క్రితం 1995లో చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీ (Chennai Military Training Academy) నుంచి ఉత్తీర్ణత సాధించి బయటకు వచ్చారు. ఆ తర్వాత దేశ రక్షణ నిమిత్తం ఆర్మీలో పని చేశారు. సరిగ్గా 27 ఏళ్ల తర్వాత ఆమె కొడుకు కూడా అదే అకాడమీలో శిక్షణ పొంది పాస్ అవుట్ అయ్యాడు. ఆ పాస్ అవుట్ పరేడ్‌కు స్మిత హాజరయ్యారు. తన సంతోషాన్ని పంచుకున్నారు. 


ఇది కూడా చదవండి..

Viral News: విహార యాత్ర ముగించుకుని ఇంటికెళ్లిన మహిళ.. బ్యాగ్ తెరిచి లోపల ఉన్న వాటిని చూసి షాక్!


ఈ నేపథ్యంలో రిటైర్డ్ మేజర్ స్మిత చతుర్వేది తన కొడుకుతో కలిసి ఆ అకాడమీ ఆవరణలో ఫొటో దిగారు. ఇది అత్యంత అరుదుగా జరిగే సంఘటన అని చెన్నై డిఫెన్స్ పీఆర్‌వో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. `27 ఏళ్లక్రితం 1995లో చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో రిటైర్డ్ మేజర్ స్మిత చతుర్వేది పాస్ అయ్యారు. ఇప్పుడు ఇదే ట్రైనింగ్ అకాడమీలో వాళ్ల అబ్బాయి కూడా ఉత్తీర్ణత సాధించాడు` అంటూ వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు స్మిత 1995లో పాస్ అవుట్ అయిన నాటి ఫొటోను కూడా షేర్ చేశారు. కాగా, ఈ అరుదైన ఘనతపై స్మిత ఆనందం వ్యక్తం చేశారు. అప్పటి సంగతులను నెమరు వేసుకున్నారు. 

Updated Date - 2022-08-01T21:13:43+05:30 IST