భారత్‌లో ఒక్క రోజే 500కు పైగా..

ABN , First Publish Date - 2020-04-04T07:02:10+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ కేసులు 3,034కు పెరిగాయి. మృతుల సంఖ్య 90కు చేరింది. ఇప్పటి దాకా 162 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,547కు చేరిందని, 62 మరణాలు నమోదయ్యాయని కేంద్రం

భారత్‌లో ఒక్క రోజే 500కు పైగా..

  • 3వేలు దాటిన కరోనా కేసులు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: దేశంలో కరోనా వైరస్‌ కేసులు 3,034కు పెరిగాయి. మృతుల సంఖ్య 90కు చేరింది. ఇప్పటి దాకా 162 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,547కు చేరిందని, 62 మరణాలు నమోదయ్యాయని కేంద్రం శుక్రవారం ప్రకటించింది.  వివిధ రాష్ట్రాలు ప్రకటిస్తున్న సంఖ్యలను బట్టి ఒక్క రోజే దాదాపు 500కు పైగా కేసులు పెరిగి... మొత్తం మూడు వేలు దాటాయి. ఈ నేపథ్యంలో అధికారులు కరోనా కట్టడికి హాట్‌స్పాట్లలో ర్యాపిడ్‌ పరీక్షలు మొదలుపెట్టారు. 24 గంటల్లో 8 వేల నమూనాలను పరీక్షించారు. మహారాష్ట్రలో శుక్రవారం ఆరు మరణాలు నమోదయ్యాయి. దీంతో మృతుల సంఖ్య అక్కడ 26కు చేరింది. దేశంలో కరోనాతో ఎక్కువ మంది చనిపోయింది, పాజిటివ్‌ కేసులు అత్యధికంగా (490) నమోదయింది కూడా ఆ రాష్ట్రంలోనే.  మర్కజ్‌ ప్రాంతంలో గుర్తించి, తరలించిన 259 మందితో కలిపి ఢిల్లీలో వైరస్‌ బాధితుల సంఖ్య 386కు పెరిగిందని సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఢిల్లీలో సమూహ వ్యాప్తి జరగడం లేదని, పరిస్థితి అదుపులో ఉన్నందున ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. తమిళనాడులో వరుసగా మూడో రోజూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా 102 కేసులతో మొత్తం 411కు పెరిగాయి. కేరళలో 384, ఢిల్లీ 386, రాజస్థాన్‌ 166, కర్ణాటక 128, యూపీ 174, మధ్యప్రదేశ్‌ 129, గుజరాత్‌ 95, జమ్మూ కశ్మీర్‌ 75, పశ్చిమ బెంగాల్‌ 57, పంజాబ్‌ 53, హరియాణా 43, బిహార్‌ 29, చండీగఢ్‌ 18, అసోం 20, లద్ధాఖ్‌ 14, అండమాన్‌ నికోబార్‌ 10, ఉత్తరాఖండ్‌ 10, చత్తీ్‌సగఢ్‌ 9, గోవా 6, హిమాచల్‌ ప్రదేశ్‌ 7, ఒడిసా 9, పుదుచ్చేరి 4, జార్ఖండ్‌ 2, మణిపూర్‌ 2, మిజోరాం 1, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఒక కేసు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఓ ఐఏఎస్‌ అధికారికి కరోనా సోకింది.  అహ్మదాబాద్‌ నగరంలోని కొవిడ్‌- 19 రోగులు 36 మంది పేర్లు, చిరునామాలను మునిసిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ అనుమానిత కేసుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇలా ప్రకటించాల్సి వచ్చిందని తెలిపింది.

Updated Date - 2020-04-04T07:02:10+05:30 IST