న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 17 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 54,735 కేసులు నమోదు కాగా 853 మంది మృతి చెందారు. భారత్‌లో ఇప్పటి వరకు 17,50,723 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 37,363 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,67,730 యాక్టివ్ కేసులు ఉండగా..ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 11,45,630 మంది డిశ్చార్జ్ అయ్యారు.