రోగులకు మరిన్ని వైద్య సేవలు

ABN , First Publish Date - 2022-05-27T05:39:33+05:30 IST

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగులకు మరి న్ని వైద్య సేవలు అందించనున్నట్టు రామగుండం మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హిమబిందు చెప్పారు.

రోగులకు మరిన్ని వైద్య సేవలు
సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ హిమ బిందు

- త్వరలోనే పారిశుధ్య కార్మికుల నియామకం

- రామగుండం మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హిమ బిందు

కళ్యాణ్‌నగర్‌, మే 26: గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగులకు మరి న్ని వైద్య సేవలు అందించనున్నట్టు రామగుండం మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హిమబిందు చెప్పారు. సోమవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులతో రెండవ అంతస్థులో 50 పడకల గదులను ప్రారంభించామని తెలిపారు. కింద ఉన్న ఆపరేషన్‌ థియేటర్‌, ఆర్థో, సర్జికల్‌, మెడికల్‌ వార్డులను పైఅంతస్థులకు తరలించనున్నట్టు, కింద రోగుల కు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. పైవార్డు లో 25బెడ్లు మెడికల్‌కు, సర్టికల్‌కు 40, ఆర్థోకు 25బెడ్లు ఏర్పాటు చేసినట్టు, అంతేకాకుండా ఎమర్జెన్సీ మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎమర్జె న్సీ క్రిటికల్‌ కేర్‌ పోస్ట్‌ ఆపరేటివ్‌ గదులను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే చూసే విధంగా ఎక్విప్‌మెంట్‌, ఆక్సిజన్‌, మందులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామన్నారు. మెడికల్‌ ఇన్సెంటివ్‌ కేర్‌, నర్సులకు విశాలమైన గదులను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. మరో వారం లోపు ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు ప్రారంభిస్తామని పేర్కొ న్నారు. ఇక్కడికి వచ్చే ఏ ఎమర్జెన్సీ కేసునైనా బయటకు పంపకుండా ప్రొఫెసర్లు, అసిస్టెంట్లు ప్రొఫెసర్లు, రెసిడెన్సీ డాక్టర్లు అందుబాటులో ఉన్నారన్నారు. త్వరలోనే పారిశుధ్య సిబ్బంది కొరత కూడా తీరుతుందన్నారు. 140మంది వరకు పారిశుధ్యసిబ్బంది నియామకం జరుగుతుందన్నారు. దీని కోసం టెండర్లు కూడా పిలిచారని, డైట్‌ కాంట్రాక్టు కూడా రద్దు చేశామన్నారు. ఆసుపత్రిలో విశాలంగా ఉండడంతో పాటు రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రిన్సిపాల్‌ హిమబిందు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మెడికల్‌ సూపరింటెండెంట్లుదయాల్‌సింగ్‌, కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఎంవోలు ధర్మేందర్‌, భీష్మా, ప్రొఫెసర్లు రాజు, అనంతబాబు, అశోక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T05:39:33+05:30 IST